హైదరాబాద్ లో ఇకపై ‘నో సెల్లార్’ ?

10-09-2024 Tue 11:44 | Telangana
Advertisement
  • కొత్త నిర్మాణాలలో సెల్లార్ కట్టడాలకు ఇకపై అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వ యోచన
  • వరదలు, భూకంప ముప్పు నేపథ్యంలో నిర్ణయం
  • స్టిల్ట్ నిర్మాణాలకు ఎన్ని అంతస్తులైనా ఓకే 
Advertisement
వరదలు, భూకంపాల ముప్పు నేపథ్యంలో హైదరాబాద్ లో ఇకపై సెల్లార్ నిర్మాణాలను అనుమతించకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పార్కింగ్ కోసం కొన్ని భవనాలలో సెల్లార్ ను రెండు నుంచి ఐదు అంతస్తుల వరకూ నిర్మిస్తుంటారు. హైదరాబాద్ లోనూ పలు కమర్షియల్ బిల్డింగ్స్ లలో ఈ తరహా సెల్లార్ లను చూడొచ్చు. అయితే, దీనివల్ల వరదలు వచ్చినపుడు సెల్లార్ లలోకి వరద నీరు చేరి అనేక ఇబ్బందులకు కారణమవుతోంది.

సెల్లార్ల నిర్మాణానికి లోతుగా తవ్వాల్సి రావడం, తవ్వి తీసిన మట్టి కూడా సమస్యగా మారింది. వీటన్నింటి వల్ల భవన నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. మరోవైపు, సిటీలోని పలు ఏరియాలను భూకంప ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. ఆయాచోట్ల నిర్మించే భవనాల్లో సెల్లార్ లు కూడా కట్టడం ప్రమాదకరమని ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్లార్ల నిర్మాణానికి అనుమతించక పోవడమే మేలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా నిబంధనలను మార్చేయాలని యోచిస్తోంది.

సాధారణంగా సెల్లార్లను పార్కింగ్ కోసం ఉపయోగిస్తుంటారు. సెల్లార్లు లేకుంటే పార్కింగ్ సమస్య ఎదురవుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా స్టిల్ట్ నిర్మాణాల (భూమి పై నుంచే పార్కింగ్ కోసం పలు అంతస్తులు వదిలి వేయడం) కు ఎన్ని అంతస్తులకైనా పర్మిషన్ ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ విధానాన్ని జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల అనుమతించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం గరిష్ఠంగా 3 స్టిల్టుల వరకు అనుమతిస్తున్నామని చెప్పారు.

నివాస సముదాయాల నిర్మాణంలో ఈ విధానాన్ని బిల్డర్లు స్వాగతించినా.. కమర్షియల్ బిల్డింగ్ ల నిర్మాణంలో పెద్దగా ఆసక్తి చూపడంలేదని వివరించారు. కమర్షియల్ బిల్డింగ్ లలో గ్రౌండ్ ఫ్లోర్ కు డిమాండ్ చాలా ఎక్కువ అని, అలాంటిది గ్రౌండ్ ఫ్లోర్ ను పార్కింగ్ కు వదిలివేస్తే నష్టపోవాల్సి వస్తుందని బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ విధానంపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
Advertisement
CellarHyderabadBuildingsBuildersBan On Cellars

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more